Posts of YS Jagan Mohan Reddy
అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’, నీ “కరప్షన్ రేటు’’ అదిరిందయ్యా చంద్రబాబు…! SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా? ▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు. ▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు. ▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు. ▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు. ▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు. ▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు. ▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు! అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా? పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు. కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు. మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా? ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ! అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం… జీవో కాపీలు- tinyurl.com/3dkuyys9
Open in Telegramచదువుతో బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చవచ్చని, మహిళా విద్యతో సమాజం పురోగమిస్తుందని నమ్మి, ఆచరణలో చూపిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా, సమాన అవకాశాలు పొందేలా ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
Open in Telegramఅసోంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కదిమి వేణు మరణం నన్ను కలచివేసింది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వేణుకు నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Open in Telegramదేవుడి ఎదుట అందరూ సమానమేనని, అది సమాజంలో వెల్లివిరియాలని తన కీర్తనల ద్వారా చాటి చెప్పిన మహనీయుడు శ్రీ భక్త కనకదాసు గారు. శ్రీకృష్ణుడిపై తనకున్న అపారమైన భక్తిని సామాన్యులకు అర్థమయ్యే భాషలో కీర్తనలుగా మలిచి, ప్రజల హృదయాలకు చేరువ చేశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్యుడైన శ్రీ భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
Open in TelegramThe bloodshed and lawlessness across Andhra Pradesh’s local body polls have now reached the Chief Minister's own constituency, Kuppam. Unable to digest YSRCP-backed candidate Mohan’s 45-vote victory for Sarpanch in Vanaguttapalli, TDP cadres cut the power, pelted stones, and attacked the Election Route Officer to block the official declaration. Fearing for his life, the officer sped away to escape the mob running over 60-year-old YSRCP worker Rajendra and dragging him for 2 km, leaving his body unrecognizable and four others injured. No election victory is worth a human life, and no government can hide behind police machinery when officials are forced to flee for their lives in the CM Chandrababu's own backyard. We demand immediate arrests and a judicial probe. #CBNJungleRaj
Open in TelegramVoters threatened with death again. Polling agents beaten and barred again. Ballot papers stolen from booths again. Mass rigging with police support again. Chandrababu garu, how are you not ashamed of what happened under your government today? During the second phase of municipal elections and the first phase of panchayat elections, your party used the police and government officials to intimidate YSRCP leaders, candidates, and the people to rig the polls. Is this how you intend to win elections? In Ahobilam, a vehicle part of TDP MLA Bhuma Akhila Priya’s convoy drove into YSRCP supporters, injuring five and leaving a woman in critical condition. In Mangampeta, coalition supporters attacked polling agents and broke one agent’s arm. In Prasannayanapalli, TDP leaders threatened officials and stole ballot papers. In Narasampalli, two men poured ink into ballot boxes, halting polling in two wards. In Vellaturu, TDP groups shut the booth doors and brought in outsiders to cast bogus votes in front of the police. In Mangalagiri-Tadepalli Municipal Corporation, voters were cycled through polling booths, in broad daylight glaringly. The same tactics played out across the state. Abductions and house arrests kept opposition leaders away. Polling agents were beaten, their appointment forms torn and their entry blocked. Voters were threatened if they backed YSRCP-supported candidates. TDP workers took over booths, glaringly used fake voter cards and wiped off voting ink. When people protested, police used lathis and took them into custody. When people filmed what was happening, they were attacked and their phones were seized or smashed. Chandrababu garu, the people of Andhra Pradesh are watching. In a democracy, every voter has the right to cast a ballot without fear. Your government will have to answer for every voter threatened, every agent assaulted and every ballot stolen. We demand justice, repolling wherever voting was compromised and action against the TDP leaders, police personnel and officials responsible. YSRCP will take these matters to court. You will have to answer for what happened under your watch. #CBNJungleRaj
Open in TelegramOur Constitution, built on Liberty, Fraternity, Equality, and Justice, remains the guiding soul of our country. True tribute to Dr. B.R. Ambedkar and the Constituent Assembly, lies not in mere words, but in fiercely protecting constitutional rights and ensuring a transparent, accountable democracy for every Indian. #ConstitutionDay
Open in TelegramViews growthHide views growth
Views growth
Hours after publication
Show as table
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 46 h | 1,240 |
| 67 h | 1,380 |
- Total to date1,380
History has been rewritten in 52 balls! Heartiest congratulations to young sensation #VaibhavSooryavanshi on shattering two world records in a single innings, smashing the fastest century (28 balls) and the fastest double century (52 balls) in List A cricket history. At just 15, his fearless brilliance continues to make the entire nation proud. Wishing him many more historic milestones ahead #RisingStarsAsiaCup
Open in Telegramమానవులంతా ఒక్కటేనని బోధిస్తూ, ప్రేమ, శాంతి, సమానత్వం వంటి గొప్ప మానవీయ విలువలను కులమతాలకు అతీతంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
Open in Telegramబ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
Open in Telegramఉపవాస దీక్షలతో, దీపారాధనలతో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించే విశిష్ట పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర దినాన మీరు వెలిగించే దీపాలు మీ ఇంట సుఖసంతోషాలను నింపాలని, ప్రతి ఒక్కరూ అభ్యున్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
Open in Telegram𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 Chandrababu 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
Open in TelegramCongratulations to The New Indian Express on the launch of The Financial Standard! May it uphold the highest standards as India’s growth story is poised to reach the top. Best wishes to the entire team for the journey ahead!
Open in Telegramప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
Open in TelegramCredit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే నారా లోకేష్ దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
Open in Telegramమున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్! జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్! మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్! ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్! ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్! గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’! నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’! ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే... Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’! నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’! పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’! గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’! ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’! నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’! అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’! ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’! ఇది కేవలం చంద్రబాబు గారికే సాధ్యం! పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84 Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
Open in Telegram