Account

Posts of Bharatheeya_Hindus

newest first

#17216Photo

#గుంటూరు జిల్లా, #కాకుమాను గ్రామంలోని మంచి నీటి చెరువును ఆక్రమించి నిర్మించిన అక్రమ మసీదు అనుబంధ షాపుల విషయంగా వేసిన #హై కోర్టు కేసు శుభారంభం హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన హైందవశక్తి. గుంటూరు జిల్లా,కాకుమాను మండలం, కాకుమాను గ్రామంలోని, పడమర చెరువు కట్టను ఆక్రమించి కట్టిన మసీదు, దానిని ఆనుకొని, అనధికారికంగా మూడు షాపులను కూడా నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలి అని "హైందవశక్తి"- వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శేడింబి. ప్రసాద్ గారు,పలుమార్లు,గుంటూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం"ప్రజా సమస్యల పరిష్కార వేదిక"లో ఫిర్యాదులు చేయటం పాఠకులకు విదితమే. సంబందిత రెవిన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు శాఖల నుంచి స్పందన అరకొరగా మాత్రమే ఉండటంతో, మన "హైందవశక్తి" ఇదే సమస్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. నిన్న అనగా 25-11-'26 వ తేదీ బుధవారం రోజున,మొట్ట మొదటి వాయిదా""Admission stage""లో జడ్జ్ మేడం-అనధికారికంగాా మన PGRS కంప్లైంట్ ను క్లోజ్ చేసిన విషయంగా; అవతలి వారి పై ప్రశ్నల వర్షం కురిపించటం జరిగింది. సమాధానం చెప్పలేక నిలబడి పోయిన ప్రభుత్వ అధికారులు. ఇక తదుపరి సంబందిత శాఖాధికారులకు అందరికీ నోటీసులు వెళ్లనున్నాయి....... అందుకే మనమంటాము......... "హైందవశక్తి" అంటే పోరాటం...... పోరాటం అంటేనే "హైందవశక్తి"..... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి: హైందవశక్తి Legal Advisor, High Court Advocate ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు Cell: 80963 11785. https://www.facebook.com/share/r/19rugWaC7D/

Open in Telegram
Views145−35%vs avg
Forwards—
Reactions1
Comments—
#17211Photo

మీ వ్యాపార అభివృద్ధి కోసం క్యాలెండర్ బుకింగ్ కొరకు బ్రిటిష్ వాడు వదిలిన ఇంగ్లీషు క్యాలెండరు మన హిందూ గృహాలలో వేలాడుతుంది. ఈ సంస్కృతిని మార్చడం కోసం "హైందవక్తి" గత 6 సంవత్సరాలుగా ఉగాది నుంచి ఉగాది వరకు ఉండే మన తెలుగు క్యాలెండర్ ను ముద్రిస్తుంది. అలాంటి తెలుగు క్యాలెండరుని మన హిందూ గృహంలోకి ఆహ్వానించండి. మన క్యాలెండర్ లో ముఖ్యమైన భగవద్గీత శ్లోకాలు, ముస్లిం రాజులు మన హిందూ దేవాలయాలపై చేసిన కుట్ర పూరిత దాడులు మరియు హిందువులపై జరిగిన ఉచకోత లాంటి హిందూ ధర్మానికి ఉపయోగపడే విలువైన సమాచారం మరియు చరిత్రకు సంబందించిన విలువైన సమాచారం ఉంది. ధర్మం కోసం తమవంతు కృషి చేస్తున్న హిందు బంధువుల వ్యాపార అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రకటనల కోసం క్యాలండర్‌లో కొన్ని బ్లాక్‌లు కేటాయించడం జరిగింది. కావున మీ వ్యాపార ప్రకటనలను అందించే అవకాశం మాకు ఇస్తూ మన హిందూ ధర్మం, మన సంస్కృతిని కూడా వ్యాప్తి చెందేలా దోహద పడతారని ఆశిస్తున్నాము. మొదటిదశ 10000 క్యాలెండర్ల ప్రింటింగ్ వెయ్యదలచాము. ఈ తెలుగు క్యాలెండర్‌లో 12 పేజీలకు 24 బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్క బ్లాక్ Rs3500/- బ్లాక్ సైజ్ 5.5×2.2 ఉంది. మీకు నచ్చిన నెలలో మీ వ్యాపారం మరియు నచ్చిన గ్రీటింగ్ విషస్ నమోదు చేసుకోగలరు. గమనిక:- ఒక్క బ్లాక్ బుక్ చేసుకున్నవారికి 25 క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వబడును.ఈ మొత్తం రుసుము కూడా మరి కొన్ని క్యాలెండర్ల ముద్రించటం కొరకే వినియోగించబడును. https://docs.google.com/forms/d/e/1FAIpQLScViBb_JgDfqpYl_aWS-f3xAUYH-qXmQ242M5jcYGgrYRXtXQ/viewform?usp=publish-editor ముఖ్య గమనిక:- మీ వ్యాపార అభివృద్ధి కోసం మీరు కూడా మీ వ్యాపారానికి సంబంధించిన సమాచారంతో కూడిన క్యాలెండర్ ను (మినిమం 1000) తయారుచేయించుకొనే సదవకాశాన్ని హిందూ బంధువులకు కల్పించేందుకు హైందవశక్తి ముందుకు వచ్చింది. ప్రకటనల కోసం సంప్రదించవలసిన నంబర్ మెండి. స్వప్న క్యాలెండర్ ఇంచార్జ్ : 8331034790 ఆఖరు తేదీ : 20/02/2027 రండి మన తెలుగు క్యాలెండర్ ను ముందు తరాలకు అందిద్దాం

Open in Telegram
Views209−6%vs avg
Forwards—
Reactions—
Comments—
#17209Photo

*57వ సర్గ 2 వ భాగం*   మంత్రుల మందరం యుద్ధం రాకతప్పదని ఆ రోజే అనుకున్నాం. ఓ రాజా! నేను నీ అభిమానానికి పాత్రుడనయ్యాను. నీ ఆదరాభిమానాల వల్ల ఎంతో సుఖసంతోషాలతో జీవిస్తున్నాను. పైగా నువ్వు నన్ను ఎంతో గౌరవంగా చూస్తున్నావు. ఇప్పుడు నేను నిన్ను సంతోషపెట్టాల్సిన సమయం వచ్చింది. అందుకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. నా భార్యాపిల్లల్ని కూడా లెక్కచెయ్యకుండావెళ్ళి యుద్ధం చేస్తాను. యుద్ధంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడి యుద్ధం చేస్తాను. నువ్వే చూస్తావుగదా!” అని రావణాసురునితో అంటూ తోటి సేనానాయకులతో ఇలా అన్నాడు: “ఓ సేనాధ్యక్షుల్లారా! యుద్దానికి సైన్యాన్ని సిద్దం చెయ్యండి పిడుగుల్లాంటి నా బాణాలతో ఆ వానరములన్నింటినీ చీల్చి చెండాడుతాను. ఆ వానరుల రక్తమాంసాలతో మనం విందు చేసుకుందాం. మిగిలింది పక్షులకు విందు చెస్తాను.”   ప్రహస్తుడు ఆజ్ఞాపించినట్లుగానే సైన్యాధ్యక్షులంతా సమస్త సేనల్నీ, మారణాయుధాల్నీ సన్నద్ధం చేశారు. మదపుటేనుగుల వంటి రాక్షస యోధులతో లంకా పట్టణం అంతా నిండిపోయింది. యుద్ధంలో జయం కలిగేందుకు రాక్షసవీరులు హోమాలు చేశారు. బ్రాహ్మణుల్ని (బ్రహ్మరాక్షసుల్ని) గంధపుష్పాలిచ్చి పూజించారు. ఆ గంధపుష్పాల సువాసన గాలిలో కలసి అంతా సుగంధాల వాసన వీచింది. యుద్దంలో విజయం తమకే సిద్ధించాలని రాక్షస వీరులంతా మంత్రించిన పుష్పమాలల్ని ధరించారు. కవచాల్ని ధరించారు. ధనుస్సు చేత ధరించి రావణునికి నమస్కరించారు. పిదప ప్రహస్తుడి వద్దకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు రావణాసురుడు ప్రహస్తుణ్ణి ఆశీర్వదించి వీడ్కోలు పలికాడు. భేరీలను మహా భయంకరంగా మోగించారు. మేఘాలవలె గర్జిస్తూ, సూర్యుడివలె కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ, చంద్రుడివలె మనోహరంగా ఉంటూ, బంగారు కిటికీలతోను, పైకప్పుతోను, సర్పధ్వజంతోను, చక్కటి చక్రాలతో అమర్చబడినదీ, మహావేగంగా పోయే గుర్రాలను పూన్నినదీ అయిన రథాన్ని తెచ్చి ప్రహస్తుడి ముందు ఉంచారు. రావణాసురుని వద్ద అనుమతి పొందిన ప్రహస్తుడు రథాన్ని అధిరోహించాడు. పిమ్మట సర్వసమర్షుడైన సారథి కూడా ఎక్కి రథాన్ని ముందుకు నడిపించాడు. రాక్షస సైన్యం అంతా ఆ రథం వెనకాలే బయలుదేరింది.   సేనాపతి అయిన ప్రహస్తుడు బయలుదేరగానే మేఘధ్వనివంటి భేరీల ధ్వని, వాద్యాలధ్వని, శంఖముల ధ్వనులతో భూమి నిండిపోయింది. రాక్షసులంతా పెద్దగా సింహనాదాలు చేశారు. ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి. శంఖాలు పూరించారు. దుందుభులు ఉరుముల్లాగా ధ్య్వనించాయి. సముద్రం పొంగిపొరలి భూమిని ముంచెత్తుతున్నట్లుగా అనిపించింది. నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు అనే నలుగురు మంత్రులు ప్రహస్తుడికి నలువైపులా నడుచుకుంటూ వెళ్ళారు. రాక్షస సేననంతా మ్యాహాలుగా విభజించి ప్రహస్తుడికి చేదోడువాదోడు ఉండేట్లు చేశారు. ప్రళయ కాలంలో సర్వాన్ని తనలో లీనం చేసుకునే యముడివలె ప్రహస్తుడు, అతడి సైనికులు చేసే అట్టహాసాలకు సింహనాదాలకు లంకా పట్టణంలో ఉండే జంతువులన్నీ భయపడిపోయాయి. భయంతో వికృత స్వరాలతో అరిచాయి. రక్తమాంసాలు తినే పక్షులు అపసవ్యంగా మండలాకారంలో తిరుగుతూ రథ ధ్వజంపై ప్రదక్షిణలు చేశాయి. నక్కలు భయంకరంగా ఊళలు వేస్తూ నిప్పులు కక్కాయి. ఆకాశం నుండి నిప్పు రవ్వల వంటి ఉల్కలు కిందపడ్డాయి. గ్రహాల మధ్య యుద్ధం ఆరంభం కావడంతో గ్రహాల కాంతులు క్షీణించాయి. మేఘాలు భయంకరంగా గర్జించాయి. రాక్షసయోధులందరూ రక్తపు వర్షం వల్ల తడిసిపోయారు. గ్రద్ద ఒకటి ప్రహస్తుడి ధ్వజంపై నిలచి ముక్కుతో రెక్కల్ని పొడుచుకుంటోంది. రథసారథి సూతవంశంలో పుట్టాడు. వంశపారంపర్యంగా రథసారథ్యమే వృత్తిగా చేపట్టినవాడు. లోగడ అనేక యుద్దాల్లో అతడు ప్రహస్తుడికి సారథిగా ఉన్నాడు. అటువంటి సారథి చేతిలోని కొరడా జారి నేలపై పడిపోయింది. రథానికి కట్టిన గుర్రాల కాళ్ళు అకారణంగా పల్లాలోపడి తొట్రుపాటు చెందాయి. గుణములచేత, పౌరుషంచేత ప్రసిద్దుడైన ప్రహస్తుడు యుద్దానికి రావడం వానర సైన్యం చూసింది. పెద్ద పెద్ద రాళ్ళనూ, వృక్షాలను పెళ్ళగిస్తూ ఉండటం ప్రహస్తుడు చూశాడు. అటు వానరులు ఇటు రాక్షసులు భీకరంగా అరుస్తూ ఒకరినొకరు కవ్వించుకుంటున్నారు. వాళ్ళు భూమ్యాకాశాలు బద్దలు అయ్యేట్లు సింహనాదాలు, అట్టహాసాలు చేశారు. దుర్మతి అయిన ప్రహస్తుడు తాను హనుమంతుణ్ణి వానరుల్ని జయించగలనని ధీమాగా అనుకున్నాడు.

Open in Telegram
Views182−18%vs avg
Forwards—
Reactions—
Comments—
#17208Link preview
Views213−4%vs avg
Forwards—
Reactions—
Comments—
#17203Photo

"హైందవశక్తి" తెలంగాణా రాష్ట్ర సేవా విభాగం" ఆధ్వర్యంలో చెంపాపేట్ కారుణ్య ఆశ్రమంలో ఉండే విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన "హైందవశక్తి" ‎ ‎"హైందవశక్తి" తెలంగాణా రాష్ట్ర-సేవా విభాగం వారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ గారి సారధ్యంలో, తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని,చెంపాపేట్ కారుణ్య ఆశ్రమంలో ఉండే విద్యార్థులకు నోట్ బుక్స్ 22 11 2026 పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ‎ ‎దాతల సహాయ సహకారాలతో మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని "హైందవశక్తి" ఆశిస్తున్నది. ‎ ‎ఈ సందర్భంగా మాకు తమ సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ మన "హైందవశక్తి" ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. ‎ ‎ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన "హైందవశక్తి" ఫుల్ టైమర్ మెండి.స్వప్న గారు, ట్రాన్సిలేటర్ మెండి.పంకజ్ కృష్ణ గార్ల కృషి ఎంతైనా అభినందనీయం. ‎ ‎అందుకే మనమంటాము ‎*మానవ సేవే మాధవ సేవ* ‎Join హైందవశక్తి 092467 30838 https://www.facebook.com/share/p/1HG3pFhYKp/

Open in Telegram
Views373+68%vs avg
Forwards—
Reactions—
Comments—
#17202Photo

తెలుగు ఉగాది క్యాలెండర్   విదేశీ సంస్కృతి మోజులో పడి మన మూలాలని మన సంప్రదాయాలని చివరికి మన భాషని కూడా మరిచిపోయి మనకి తెలియకుండానే మన ధర్మాన్ని విస్మరిస్తూ మన ఉనికిని కోల్పోతున్నాము..   అయినా ఇప్పటికీ కూడా తిధులు ముహూర్తాలు లేకుండా ఎలాంటి పనులు తలపెట్టము...మరి ఏది రాహు కాలం, ఏది మంచి కాలం లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ప్రతి హిందువు ఇంట్లో మన మూలాలని తెలుసుకోవాలి. తెలుగు క్యాలండర్ తప్పనిసరిగా ఉండాలి...అనే సదుద్దేశంతో హైందవశక్తి సంస్థ వారు తెలుగు క్యాలండర్ ని ముద్రిస్తున్నారు..   మన క్యాలెండర్ లో ముఖ్యమైన భగవద్గీత శ్లోకాలు, ముస్లిం రాజులు మన హిందూ దేవాలయాలపై చేసిన కుట్ర పూరిత దాడులు మరియు హిందువులపై జరిగిన ఉచకోత లాంటి హిందూ ధర్మానికి ఉపయోగపడే విలువైన సమాచారం మరియు చరిత్రకు సంబందించిన విలువైన సమాచారం ఉంది.   మొదటిదశ 10000 క్యాలెండర్ల ప్రింటింగ్ వెయ్యదలచాము.   సభ్యులకు క్యాలెండర్ కావలసిన వారికి ఒక క్యాలెండర్ 70/- మీ వివరాలు, ఈ క్రింది నెంబర్ కి కాల్ చేసి తెలుపగలరు. మెండి. స్వప్న క్యాలెండర్ ఇంచార్జ్ : 8331034790 ఆఖరు తేదీ : 10/03/2027   గమనిక:-మినిమం 5 క్యాలెండర్లు బుక్ చేసుకోవలెను. 5 క్యాలెండర్లు డెలివరీ చార్జెస్ 200 తో కలిపి మొత్తము 550 రూపాయలు   రండి మన తెలుగు క్యాలెండర్ ను ముందు తరాలకు అందిద్దాం   క్యాలెండర్ బుక్ చేయదలుచుకున్న వారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి   https://docs.google.com/.../1FAIpQLSexfr673DO.../viewform...   హైందవశక్తి తెలుగు ఉగాది క్యాలెండర్ 2027-2028

Open in Telegram
Views309+39%vs avg
Forwards—
Reactions—
Comments—
#17197Link preview
Views239+8%vs avg
Forwards—
Reactions—
Comments—
#17195Photo

57వ సర్గ 1 వ భాగం ప్రహ హస్తుడితో యుద్దం   అకంపనుణ్ణి హనుమంతుడు చంపేశాడని రావణాసురుడు విన్నాడు. ఆ రాక్షసరాజు ముఖం వెలవెలబోయింది. మంత్రుల వంక చూశాడు. మంత్రు లందరితోనూ మంతనాలు జరిపాడు. దీర్దాలోచన చేయగా ఆ లంకానగరం అంతా ఒకసారి కలయతిరగాలన్న కోరిక కలిగింది. అప్పటికి ఇంకా అపరాహ్హం కాలేదు. ఇంకా ఉదయపు ఘడియల్లోనే ఉంది. పట్టణాన్ని రక్షిస్తున్న సమూహాల్ని, మ్యాహాలుగా ఉన్న సేనల్ని, పతాకాలతో అలంకరించిన ధ్వజాలను చూశాడు. బలవంతులైన రాక్షస సేనల్ని ఎదిరిస్తున్న వానర సేనలపై కోపం బాగా పెరిగింది. తిరిగి తన భవనానికి వెళ్ళాడు. యుద్దాలలో ఆరితేరిన ప్రహస్తుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: “ఓ ప్రహస్తుడా! నీవు యుద్దాలు చేయడంలో నేర్చరివి. విశారదుడవు. శత్రువులు మన సేనల్ని ఇబ్బంది పెడ్తున్నారు. మన పట్టణాన్ని ముట్టడించారు. నువ్వు తప్ప మరొకరెవ్వరూ ఈ శత్రు మూకల్ని తరిమికొట్టలేరు. వెళ్లే నేను స్వయంగా వెళ్ళాలి. లేదంటే, కుంభకర్ణుడుగాని, ఇంద్రజిత్తుగాని, సేనాపతివైన నీవో ఈ పని చక్కబెట్టగల సమర్థులు. అందువల్ల నీవు ఇప్పుడే తగినంత సైన్యాన్ని వెంటబెట్టుకొని వానరులందరినీ సంహరించిరా. నీవు మన సైన్యంతో ముందు నిలబడితేనే చాలు! ఈ వానర సైన్యం అంతా చెట్టుకొకడు, పుట్టకొకడుగా పారిపోతారు. వాళ్ళంతా కోతిమూకలు. వాళ్ళల్లో యుద్దశిక్షణ ఎంతమాత్రమూ లేదు. నీ సింహనాదాలు వినగానే, సింహగర్దనకు ఏనుగుల వలె, వానరులంతా మనోనిబ్బరం కోల్పోయి పరుగులు తీస్తారు.   ఓ ప్రహస్తుడా! నీవు ఆ విధంగా వానర సేనల్ని చెల్లాచెదరు చేశావంటే రామలక్ష్మణ, సుగ్రీవులు ఒంటరివాళ్ళయిపోతారు. అప్పుడు నీవు మన సైన్యంతో వాళ్ళను ముట్టడించి వాళ్ళను తేలికగా చంపెయ్యవచ్చు. ఒకవేళ మనం అనుకున్నట్లు జరిగినా, జరగకపోయినా కూడా, మనం వీరోచితంగా యుద్ధం చెయ్యాలేగాని, వేరే మార్గాంతరం లేదు. యుద్దాల్లో జయాపజయాలు ఎవరివో ముందుగానే నిర్ణయించలేము. అలా అని యుద్ధం చెయ్యకుండా ఉండనూ లేముగదా!   ఒకవేళ తాత్సారం చేశామే అనుకో! ఇంతదూరం వచ్చిన శత్రువు మనల్ని చంపిగాని వెనక్కు పోడు. యుద్దంలో జయం మనల్ని కూడా వరించవచ్చు గదా! మనం పూర్వం ఎన్నో యుద్దాల్లో దేవతల్ని కూడా జయించాం. కాబట్టి ఇప్పుడు వీరోచితంగా పోట్లాడటమే మన కర్తవ్యం. ఓ ప్రహస్తుడా! నీ ఆలోచన ఏమిటో కూడా చెప్పు. నేను చెప్పిందంతా నీకు నచ్చినా, నచ్చకపోయినా నిర్భయంగా, నీ అభిప్రాయం చెప్పు.” రాక్షసరాజైన రావణుడు చెప్పినదంతా ప్రహస్తుడు విని, అసురరాజుతో శుక్రాచార్యుడి వలె ఇలా బదులు చెప్పాడు. “ఓ రాజా! నువ్వు చెప్పినదంతా ఇదివరకే మంత్రి మండలిలో చర్చించాం. వివాదాలు కూడా వచ్చాయి. సీతాదేవిని ఇచ్చివేసినట్లయితే యుద్ధం ఉండదని, అలా ఇవ్వకపోతే యుద్ధం తప్పదని అనుకున్నాం. నీవు సీతాదేవిని ఇవ్వటానికి ఇష్టపడలేదు.

Open in Telegram
Views192−13%vs avg
Forwards—
Reactions—
Comments—