Account
Bharatheeya_Hindus

Bharatheeya_Hindus

హిందూ ధర్మంపై జరిగే దాడులను తెలియజేసి హిందువులను మేల్కొలపటం ఈ సంస్థ లక్ష్యం Admin : 9246730838 Page: https://www.facebook.com/haindavasakthipage You Tube: https://www.youtube.com/c/Haindavasakthi

Username
@indian_hindus
Category
Politics
Country
IndiaIndia
Subscribers3,870
Avg views per post, 7d222last 7 days
ERR5.73%last 7 days

Average views per post by day

By publication day

Show as table
DateAvg views per post
Nov 25, 2026234
Nov 26, 2026210

Most viewed this month

  1. 01

    "హైందవశక్తి" తెలంగాణా రాష్ట్ర సేవా విభాగం" ఆధ్వర్యంలో చెంపాపేట్ కారుణ్య ఆశ్రమంలో ఉండే విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన "హైందవశక్తి" ‎ ‎"హైందవశక్తి" తెలంగాణా రాష్ట్ర-సేవా విభాగం వారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ గారి సారధ్యంలో, తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని,చెంపాపేట్ కారుణ్య ఆశ్రమంలో ఉండే విద్యార్థులకు నోట్ బుక్స్ 22 11 2026 పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ‎ ‎దాతల సహాయ సహకారాలతో మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని "హైందవశక్తి" ఆశిస్తున్నది. ‎ ‎ఈ సందర్భంగా మాకు తమ సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ మన "హైందవశక్తి" ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. ‎ ‎ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన "హైందవశక్తి" ఫుల్ టైమర్ మెండి.స్వప్న గారు, ట్రాన్సిలేటర్ మెండి.పంకజ్ కృష్ణ గార్ల కృషి ఎంతైనా అభినందనీయం. ‎ ‎అందుకే మనమంటాము ‎*మానవ సేవే మాధవ సేవ* ‎Join హైందవశక్తి 092467 30838 https://www.facebook.com/share/p/1HG3pFhYKp/

    Photo
    Views373
    Forwards—
    Reactions—
    Comments—
  2. 02
    Views358
    Forwards—
    Reactions—
    Comments—
  3. 03
    Views315
    Forwards—
    Reactions—
    Comments—
  4. 04

    తెలుగు ఉగాది క్యాలెండర్   విదేశీ సంస్కృతి మోజులో పడి మన మూలాలని మన సంప్రదాయాలని చివరికి మన భాషని కూడా మరిచిపోయి మనకి తెలియకుండానే మన ధర్మాన్ని విస్మరిస్తూ మన ఉనికిని కోల్పోతున్నాము..   అయినా ఇప్పటికీ కూడా తిధులు ముహూర్తాలు లేకుండా ఎలాంటి పనులు తలపెట్టము...మరి ఏది రాహు కాలం, ఏది మంచి కాలం లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ప్రతి హిందువు ఇంట్లో మన మూలాలని తెలుసుకోవాలి. తెలుగు క్యాలండర్ తప్పనిసరిగా ఉండాలి...అనే సదుద్దేశంతో హైందవశక్తి సంస్థ వారు తెలుగు క్యాలండర్ ని ముద్రిస్తున్నారు..   మన క్యాలెండర్ లో ముఖ్యమైన భగవద్గీత శ్లోకాలు, ముస్లిం రాజులు మన హిందూ దేవాలయాలపై చేసిన కుట్ర పూరిత దాడులు మరియు హిందువులపై జరిగిన ఉచకోత లాంటి హిందూ ధర్మానికి ఉపయోగపడే విలువైన సమాచారం మరియు చరిత్రకు సంబందించిన విలువైన సమాచారం ఉంది.   మొదటిదశ 10000 క్యాలెండర్ల ప్రింటింగ్ వెయ్యదలచాము.   సభ్యులకు క్యాలెండర్ కావలసిన వారికి ఒక క్యాలెండర్ 70/- మీ వివరాలు, ఈ క్రింది నెంబర్ కి కాల్ చేసి తెలుపగలరు. మెండి. స్వప్న క్యాలెండర్ ఇంచార్జ్ : 8331034790 ఆఖరు తేదీ : 10/03/2027   గమనిక:-మినిమం 5 క్యాలెండర్లు బుక్ చేసుకోవలెను. 5 క్యాలెండర్లు డెలివరీ చార్జెస్ 200 తో కలిపి మొత్తము 550 రూపాయలు   రండి మన తెలుగు క్యాలెండర్ ను ముందు తరాలకు అందిద్దాం   క్యాలెండర్ బుక్ చేయదలుచుకున్న వారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి   https://docs.google.com/.../1FAIpQLSexfr673DO.../viewform...   హైందవశక్తి తెలుగు ఉగాది క్యాలెండర్ 2027-2028

    Photo
    Views309
    Forwards—
    Reactions—
    Comments—

Latest posts

#17216Photo

#గుంటూరు జిల్లా, #కాకుమాను గ్రామంలోని మంచి నీటి చెరువును ఆక్రమించి నిర్మించిన అక్రమ మసీదు అనుబంధ షాపుల విషయంగా వేసిన #హై కోర్టు కేసు శుభారంభం హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన హైందవశక్తి. గుంటూరు జిల్లా,కాకుమాను మండలం, కాకుమాను గ్రామంలోని, పడమర చెరువు కట్టను ఆక్రమించి కట్టిన మసీదు, దానిని ఆనుకొని, అనధికారికంగా మూడు షాపులను కూడా నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలి అని "హైందవశక్తి"- వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శేడింబి. ప్రసాద్ గారు,పలుమార్లు,గుంటూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం"ప్రజా సమస్యల పరిష్కార వేదిక"లో ఫిర్యాదులు చేయటం పాఠకులకు విదితమే. సంబందిత రెవిన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు శాఖల నుంచి స్పందన అరకొరగా మాత్రమే ఉండటంతో, మన "హైందవశక్తి" ఇదే సమస్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. నిన్న అనగా 25-11-'26 వ తేదీ బుధవారం రోజున,మొట్ట మొదటి వాయిదా""Admission stage""లో జడ్జ్ మేడం-అనధికారికంగాా మన PGRS కంప్లైంట్ ను క్లోజ్ చేసిన విషయంగా; అవతలి వారి పై ప్రశ్నల వర్షం కురిపించటం జరిగింది. సమాధానం చెప్పలేక నిలబడి పోయిన ప్రభుత్వ అధికారులు. ఇక తదుపరి సంబందిత శాఖాధికారులకు అందరికీ నోటీసులు వెళ్లనున్నాయి....... అందుకే మనమంటాము......... "హైందవశక్తి" అంటే పోరాటం...... పోరాటం అంటేనే "హైందవశక్తి"..... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే సంప్రదించండి: హైందవశక్తి Legal Advisor, High Court Advocate ధూపం.చంద్రశేఖర్ గారు- గుంటూరు Cell: 80963 11785. https://www.facebook.com/share/r/19rugWaC7D/

Open in Telegram
Views145−35%vs avg
Forwards—
Reactions1
Comments—
#17211Photo

మీ వ్యాపార అభివృద్ధి కోసం క్యాలెండర్ బుకింగ్ కొరకు బ్రిటిష్ వాడు వదిలిన ఇంగ్లీషు క్యాలెండరు మన హిందూ గృహాలలో వేలాడుతుంది. ఈ సంస్కృతిని మార్చడం కోసం "హైందవక్తి" గత 6 సంవత్సరాలుగా ఉగాది నుంచి ఉగాది వరకు ఉండే మన తెలుగు క్యాలెండర్ ను ముద్రిస్తుంది. అలాంటి తెలుగు క్యాలెండరుని మన హిందూ గృహంలోకి ఆహ్వానించండి. మన క్యాలెండర్ లో ముఖ్యమైన భగవద్గీత శ్లోకాలు, ముస్లిం రాజులు మన హిందూ దేవాలయాలపై చేసిన కుట్ర పూరిత దాడులు మరియు హిందువులపై జరిగిన ఉచకోత లాంటి హిందూ ధర్మానికి ఉపయోగపడే విలువైన సమాచారం మరియు చరిత్రకు సంబందించిన విలువైన సమాచారం ఉంది. ధర్మం కోసం తమవంతు కృషి చేస్తున్న హిందు బంధువుల వ్యాపార అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రకటనల కోసం క్యాలండర్‌లో కొన్ని బ్లాక్‌లు కేటాయించడం జరిగింది. కావున మీ వ్యాపార ప్రకటనలను అందించే అవకాశం మాకు ఇస్తూ మన హిందూ ధర్మం, మన సంస్కృతిని కూడా వ్యాప్తి చెందేలా దోహద పడతారని ఆశిస్తున్నాము. మొదటిదశ 10000 క్యాలెండర్ల ప్రింటింగ్ వెయ్యదలచాము. ఈ తెలుగు క్యాలెండర్‌లో 12 పేజీలకు 24 బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్క బ్లాక్ Rs3500/- బ్లాక్ సైజ్ 5.5×2.2 ఉంది. మీకు నచ్చిన నెలలో మీ వ్యాపారం మరియు నచ్చిన గ్రీటింగ్ విషస్ నమోదు చేసుకోగలరు. గమనిక:- ఒక్క బ్లాక్ బుక్ చేసుకున్నవారికి 25 క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వబడును.ఈ మొత్తం రుసుము కూడా మరి కొన్ని క్యాలెండర్ల ముద్రించటం కొరకే వినియోగించబడును. https://docs.google.com/forms/d/e/1FAIpQLScViBb_JgDfqpYl_aWS-f3xAUYH-qXmQ242M5jcYGgrYRXtXQ/viewform?usp=publish-editor ముఖ్య గమనిక:- మీ వ్యాపార అభివృద్ధి కోసం మీరు కూడా మీ వ్యాపారానికి సంబంధించిన సమాచారంతో కూడిన క్యాలెండర్ ను (మినిమం 1000) తయారుచేయించుకొనే సదవకాశాన్ని హిందూ బంధువులకు కల్పించేందుకు హైందవశక్తి ముందుకు వచ్చింది. ప్రకటనల కోసం సంప్రదించవలసిన నంబర్ మెండి. స్వప్న క్యాలెండర్ ఇంచార్జ్ : 8331034790 ఆఖరు తేదీ : 20/02/2027 రండి మన తెలుగు క్యాలెండర్ ను ముందు తరాలకు అందిద్దాం

Open in Telegram
Views209−6%vs avg
Forwards—
Reactions—
Comments—
#17209Photo

*57వ సర్గ 2 వ భాగం*   మంత్రుల మందరం యుద్ధం రాకతప్పదని ఆ రోజే అనుకున్నాం. ఓ రాజా! నేను నీ అభిమానానికి పాత్రుడనయ్యాను. నీ ఆదరాభిమానాల వల్ల ఎంతో సుఖసంతోషాలతో జీవిస్తున్నాను. పైగా నువ్వు నన్ను ఎంతో గౌరవంగా చూస్తున్నావు. ఇప్పుడు నేను నిన్ను సంతోషపెట్టాల్సిన సమయం వచ్చింది. అందుకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. నా భార్యాపిల్లల్ని కూడా లెక్కచెయ్యకుండావెళ్ళి యుద్ధం చేస్తాను. యుద్ధంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడి యుద్ధం చేస్తాను. నువ్వే చూస్తావుగదా!” అని రావణాసురునితో అంటూ తోటి సేనానాయకులతో ఇలా అన్నాడు: “ఓ సేనాధ్యక్షుల్లారా! యుద్దానికి సైన్యాన్ని సిద్దం చెయ్యండి పిడుగుల్లాంటి నా బాణాలతో ఆ వానరములన్నింటినీ చీల్చి చెండాడుతాను. ఆ వానరుల రక్తమాంసాలతో మనం విందు చేసుకుందాం. మిగిలింది పక్షులకు విందు చెస్తాను.”   ప్రహస్తుడు ఆజ్ఞాపించినట్లుగానే సైన్యాధ్యక్షులంతా సమస్త సేనల్నీ, మారణాయుధాల్నీ సన్నద్ధం చేశారు. మదపుటేనుగుల వంటి రాక్షస యోధులతో లంకా పట్టణం అంతా నిండిపోయింది. యుద్ధంలో జయం కలిగేందుకు రాక్షసవీరులు హోమాలు చేశారు. బ్రాహ్మణుల్ని (బ్రహ్మరాక్షసుల్ని) గంధపుష్పాలిచ్చి పూజించారు. ఆ గంధపుష్పాల సువాసన గాలిలో కలసి అంతా సుగంధాల వాసన వీచింది. యుద్దంలో విజయం తమకే సిద్ధించాలని రాక్షస వీరులంతా మంత్రించిన పుష్పమాలల్ని ధరించారు. కవచాల్ని ధరించారు. ధనుస్సు చేత ధరించి రావణునికి నమస్కరించారు. పిదప ప్రహస్తుడి వద్దకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు రావణాసురుడు ప్రహస్తుణ్ణి ఆశీర్వదించి వీడ్కోలు పలికాడు. భేరీలను మహా భయంకరంగా మోగించారు. మేఘాలవలె గర్జిస్తూ, సూర్యుడివలె కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ, చంద్రుడివలె మనోహరంగా ఉంటూ, బంగారు కిటికీలతోను, పైకప్పుతోను, సర్పధ్వజంతోను, చక్కటి చక్రాలతో అమర్చబడినదీ, మహావేగంగా పోయే గుర్రాలను పూన్నినదీ అయిన రథాన్ని తెచ్చి ప్రహస్తుడి ముందు ఉంచారు. రావణాసురుని వద్ద అనుమతి పొందిన ప్రహస్తుడు రథాన్ని అధిరోహించాడు. పిమ్మట సర్వసమర్షుడైన సారథి కూడా ఎక్కి రథాన్ని ముందుకు నడిపించాడు. రాక్షస సైన్యం అంతా ఆ రథం వెనకాలే బయలుదేరింది.   సేనాపతి అయిన ప్రహస్తుడు బయలుదేరగానే మేఘధ్వనివంటి భేరీల ధ్వని, వాద్యాలధ్వని, శంఖముల ధ్వనులతో భూమి నిండిపోయింది. రాక్షసులంతా పెద్దగా సింహనాదాలు చేశారు. ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి. శంఖాలు పూరించారు. దుందుభులు ఉరుముల్లాగా ధ్య్వనించాయి. సముద్రం పొంగిపొరలి భూమిని ముంచెత్తుతున్నట్లుగా అనిపించింది. నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు అనే నలుగురు మంత్రులు ప్రహస్తుడికి నలువైపులా నడుచుకుంటూ వెళ్ళారు. రాక్షస సేననంతా మ్యాహాలుగా విభజించి ప్రహస్తుడికి చేదోడువాదోడు ఉండేట్లు చేశారు. ప్రళయ కాలంలో సర్వాన్ని తనలో లీనం చేసుకునే యముడివలె ప్రహస్తుడు, అతడి సైనికులు చేసే అట్టహాసాలకు సింహనాదాలకు లంకా పట్టణంలో ఉండే జంతువులన్నీ భయపడిపోయాయి. భయంతో వికృత స్వరాలతో అరిచాయి. రక్తమాంసాలు తినే పక్షులు అపసవ్యంగా మండలాకారంలో తిరుగుతూ రథ ధ్వజంపై ప్రదక్షిణలు చేశాయి. నక్కలు భయంకరంగా ఊళలు వేస్తూ నిప్పులు కక్కాయి. ఆకాశం నుండి నిప్పు రవ్వల వంటి ఉల్కలు కిందపడ్డాయి. గ్రహాల మధ్య యుద్ధం ఆరంభం కావడంతో గ్రహాల కాంతులు క్షీణించాయి. మేఘాలు భయంకరంగా గర్జించాయి. రాక్షసయోధులందరూ రక్తపు వర్షం వల్ల తడిసిపోయారు. గ్రద్ద ఒకటి ప్రహస్తుడి ధ్వజంపై నిలచి ముక్కుతో రెక్కల్ని పొడుచుకుంటోంది. రథసారథి సూతవంశంలో పుట్టాడు. వంశపారంపర్యంగా రథసారథ్యమే వృత్తిగా చేపట్టినవాడు. లోగడ అనేక యుద్దాల్లో అతడు ప్రహస్తుడికి సారథిగా ఉన్నాడు. అటువంటి సారథి చేతిలోని కొరడా జారి నేలపై పడిపోయింది. రథానికి కట్టిన గుర్రాల కాళ్ళు అకారణంగా పల్లాలోపడి తొట్రుపాటు చెందాయి. గుణములచేత, పౌరుషంచేత ప్రసిద్దుడైన ప్రహస్తుడు యుద్దానికి రావడం వానర సైన్యం చూసింది. పెద్ద పెద్ద రాళ్ళనూ, వృక్షాలను పెళ్ళగిస్తూ ఉండటం ప్రహస్తుడు చూశాడు. అటు వానరులు ఇటు రాక్షసులు భీకరంగా అరుస్తూ ఒకరినొకరు కవ్వించుకుంటున్నారు. వాళ్ళు భూమ్యాకాశాలు బద్దలు అయ్యేట్లు సింహనాదాలు, అట్టహాసాలు చేశారు. దుర్మతి అయిన ప్రహస్తుడు తాను హనుమంతుణ్ణి వానరుల్ని జయించగలనని ధీమాగా అనుకున్నాడు.

Open in Telegram
Views182−18%vs avg
Forwards—
Reactions—
Comments—
#17208Link preview
Views213−4%vs avg
Forwards—
Reactions—
Comments—

All posts

Connections